ఘనంగా జాతీయ గణితశాస్త్ర దినోత్సవం **

Published: Friday December 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 22 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాశ్రీనివాస రామానుజన్  కళాశాలలో రామానుజన్ చేసిన సేవలపై విద్యార్థులకు వక్తలు వివరించారు. రామానుజన్ కృషితో ఎన్నో రకాల కార్యక్రమాలకు గణితశాస్త్రం మూలమైందన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకోవడంసంతోషంగా ఉందని తెలిపారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరని,శుద్ధ గణితంలోఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగములో విశేషమైన కృషి చేశారన్నారు. అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడని అన్నారు. ఈయనలోని గణిత పరిశోధన ప్రవృత్తి ఏకాంతములోనే ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకులు విజయ్ కాంత్, ఫాతిమా విద్యార్థులు పాల్గొన్నారు.