నరసింహారావుకు స్వీట్ తినిపించిన పొంగులేటి..

Published: Wednesday February 15, 2023
తల్లాడ, ఫిబ్రవరి 14 (ప్రజా పాలన న్యూస్):
 
 *తల్లాడ మండలంలోని నారయబంజర గ్రామానికి చెందిన పొంగులేటి వర్గ నేత బానోతు నరసింహారావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హైదరాబాదులో ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించారు. ఆయనతోపాటు ఖమ్మం మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య స్వీట్లు తినిపించారు. ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.*