భారతీయ జనతా పార్టీ తోనే మహిళలకు సముచిత స్థానం మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మందా రాజ్యం

Published: Friday June 24, 2022

బోనకల్, జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి:: స్థానిక మండల కేంద్రంలోని యువనేత బీపీ నాయక్ క్యాంపు కార్యాలయంలో జరిగిన గిరిజన మోర్చా మండల అధ్యక్షులు భూక్య సైదా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఒక సాధారణ దశ నుండి జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా ఎదిగిన గిరిజన మహిళ నేత ద్రౌపతి ముర్మ్ ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మంద రాజ్యం మాట్లాడుతూ మహిళలకు భారతీయ జనతా పార్టీ ఇస్తున్న సముచిత స్థానం మరి ఏ ఇతర పార్టీ ఇవ్వడం లేదని, మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది అనడానికి మహిళలకే అందులో గిరిజన జాతికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం నిలువెత్తు సాక్ష్యం అని అన్నారు. అనంతరం యువ నేత బీపీ నాయక్, ఓబీసీ మోర్చా కార్యదర్శి జంపాల రవి లు మాట్లాడుతూ ఇప్పటివరకు ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశాయని భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి సత్తా కలిగిన వారికి దేశ అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టడం, వారిని ఉన్నత స్థాయిలో ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ప్రపంచంలో కూడా వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగించడం కేవలం ఒక్క బీజేపీ పార్టీకే మాత్రమే సాధ్యం గతంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం , మొన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామనాథ్ కోవిద్, నేడు గిరాజన బిడ్డ మహిళ అయిన ద్రౌపతి ముర్మ్ ని రాష్ట్రపతి అభ్యర్థి గా ప్రకటించటం యావత్ మహిళలోకనికి గర్వకారణం అని ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ , అమిత్ షా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువ మోర్చా అధ్యక్షుడు కాలసాని పరశు రామ్, మహిళ మోర్చా మండల నాయుకురాలు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.