ఉచిత శిక్షణను గిరి యువత సద్వినియోగం చేసుకోవాలి ** ఐటీడీఏ ఇంచార్జ్ పిఓ వరుణ్ రెడ్డి **

Published: Tuesday February 07, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 6 (ప్రజాపాలన, ప్రతినిధి) : గిరిజన సాంప్రదాయ, ఆదివాసి కల, చిత్ర కలలు, గొండి పెయింటింగ్స్, నందు గిరి యువతకు 2 నెలలు ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందని ఐటీడీఏ ఇన్చార్జి పిఓ కే వరుణ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు ఎస్ఎస్సి పాసై సర్టిఫికెట్ ఆధార్ కార్డు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉట్నూర్ కె.వి కాంప్లెక్స్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో 10,2, 23,న హాజరుకావాలని కోరారు. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేట్ సంస్థలలో ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. ఉచిత శిక్షణను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిఓ ప్రకటనలో కోరారు. వివరాలకు ఐటీడీఏ జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ 9032383999, నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.