నీటి ఎద్దడిని తీర్చండి

Published: Wednesday May 11, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 10 మే ప్రజాపాలన : నీటి ఎద్దడిని తీర్చాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగుల్ చిట్టంపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా మద్గుల్ చిట్టంపల్లి మరియు టేకులబీడు తండాలో ఉదయం 7 గంటల నుండి 10:30 గంటల వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు నీటి సమస్య ఉందని తెలుపగా, ఎమ్మెల్యే స్పందించి వారం రోజుల్లో నీటి సమస్యలు పరిష్కారం చేసి నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. పాడుబడ్డ ఇళ్ళను వెంటనే తొలగించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ... పట్టణ ప్రగతి సరైన పద్దతిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఓల్టేజ్ సరిపోవడం లేదని ప్రజలు తెలుపగా, కొత్త ట్రాన్స్ఫర్మార్ ఏర్పాటు చేసి, పాత స్థంభాలను తొలగించి కొత్త స్థంభాలు ఏర్పాటు చేసి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలంన్నారు. మరుగుదొడ్లు నిర్మించిన బిల్లులు మంజూరు కాలేనటువంటి వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, మరుగుదొడ్లు వాడుకలో ఉంచాలని, ప్రజలకు సూచించారు.
బస్తీ ప్రజల సుస్తీ నివారణే లక్ష్యం : 
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో బస్తీ దవఖానను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతో బస్తీ దవఖానల ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగానే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నిఘా నేత్రాలతో నేర నియంత్రణ: 
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీ.సీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైందని, భద్రత రీత్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వార్డు కౌన్సిలర్లు కుమ్మర్పల్లి గోపాల్ ముదిరాజ్, పరిగి సంతోష నర్సిములు, పిఏసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.