ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో అగ్నివీర్ వాయు అవగాహన కార్యక్రమం

Published: Wednesday November 23, 2022

జగిత్యాల, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో అగ్నివీర్ వాయు సేనలో విద్యార్థులను యువ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ సైన్యంలో చేరడానికి అవగాహన కార్యక్రమాన్ని ఇన్చార్జి ప్రిన్సిపల్ జి చంద్రయ్య ఏర్పాటు చేసినారు. జి చంద్రయ్య మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక మంది యువకులు దేశ సేవలో ముందుండాలని అగ్ని వీర్  వాయిసేనలో చేరి దేశభక్తిని, శౌర్యాన్ని చాటాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో అగ్ని వీర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురుర్ సుల్తానా, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ ఏ శంకరయ్య, డాక్టర్ కే కిరణ్ మై, రాపర్తి శ్రీనివాస్, రహీం, సంఘీసు సత్యం, జి మానస, రజిని, అనంతరావు, లక్ష్మణ్, బత్తుల నరసయ్య, ఎదునూరి నవీన్, జోష్ణ, జమున, మాధవి, సునీత, రమేష్, భాగ్యలక్ష్మి, సంగీత అశ్విత, సురేష్, వీణ, తదితర అధ్యాపకులు, 300 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.