కల్యాణ లక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకు గొప్ప వరం

Published: Thursday April 29, 2021
సాతారం సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్
మల్లాపూర్, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మల్లాపూర్ మండలం సాతరం గ్రామంలో గ్రామ పంచాయితి కార్యాలయం ఆవరణలో కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం గ్రామానికి చెందిన ఏడుగురికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామ సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, సాది ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డకు ఒక గొప్ప వరం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, విఆర్వో జాకీర్ ఉసేన్ తదితరులు పాల్గొన్నారు.