నర్సింహ్మ రెడ్డి కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం* *ఉద్యమకారుడు మంచాని నరసింహారెడ్డి కుటుం

Published: Tuesday December 20, 2022
*ప్రజాపాలన షాబాద్*::--అనారోగ్య పరిస్థితులతో హఠత్మరణానికి గురైన తెలంగాణ ఉద్యమకారుడు మంచాని నర్సింహ్మ రెడ్డి కుటుంబానికి షాబాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అండగా నిలిచారు. నర్సింహ్మ రెడ్డి 
 స్వగ్రామం  కుమ్మరిగూడకు  వెళ్లి ఆయన కుటుంబాన్ని మరొకసారి పలుకురించారు.
 ఈ సందర్భంగా రూ. 20 వేల నగదును నరసింహారెడ్డి భార్య  అరుంధతి,   కుమారులు రాఘవేందర్ రెడ్డి, శ్యాం సుందర్ రెడ్డి ల (టిల్లు) కు అందించారు. బ్రిటన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 
రాఘవేందర్ రెడ్డికి బాగోగులు వాకబు చేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా నిలుస్తామన్నారు. అవసరమైతే మరో మారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి ఇంకా ఏదైన సహకారం అందిస్తామని తెలిపారు.
అధికారులతో చర్చించి రైతు బీమా తదితర సహాయం వెంటనే అందేలా చూస్తామని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
 
ఉద్యమ కాలంలో స్వరాష్ట్రం కోసం నర్సింహ్మ రెడ్డి ఎంతో తపించే వాడని మరోసారి గుర్తుచేశారు.
 
మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్, 
 తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ మల్లారెడ్డి, నేతలు పెంటయ్య, శివరాములు,
 సర్పంచ్ పొనమోని కేతన రమేష్, సర్పంచులు, మాజీ సర్పంచులు  తదితరులు పాల్గొన్నారు.
 *రాములు కుటుంబాన్ని పరామర్శ* ఇదిలా ఉండగా ఇటీవల మాతృ వియోగానికి గురైన కుమ్మరిగూడ మాజీ సర్పంచ్ నందిగామ రాములు గౌడ్ కుటుంబాన్ని షాబాద్ జెడ్పిటీసీ పట్నం అవినాష్  రెడ్డి పరామర్శించారు. రాములు తల్లి
అనుసూజ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభుతి ప్రకటించిన అవినాష్ రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్, నాగరగూడ సర్పంచ్ పొనమోని కేతన రమేష్ యాదవ్, కృష్ణ గౌడ్, నాయకులు మాజీ సర్పంచులు వెంకటేష్ గౌడ్, పరిగి గణేష్ గౌడ్, మాజీ ప్రధానోపాధ్యాయులు శివరాములు,పెంటయ్య, అంజనేయులు, రవి, పాపిరెడ్డి, అభిలాష, అనంతరామయ్య తదితరులు  పాల్గొన్నారు.