వైద్యులపై పోలీసు అధికారులపై దాడులు చేయడం అమానుషం!

Published: Tuesday April 20, 2021

భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల శివ కుమార్

కొత్తగూడెం, భద్రాద్రి, కొత్తగూడం జిల్లా, ఏప్రిల్ 19, ప్రజాపాలన ప్రతినిధి : ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తు స్వైర విహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతు వేలాదిగా లక్షలాదిగా ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య చికిత్సలను అందిస్తున్న వైద్యులను వైద్య సిబ్బందిని మరియు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతూ మనోధైర్యాన్ని అందిస్తున్న పోలీసు అధికారులను ఘనపరచి అభినందించేది పోయి వారిపై దాడులు చేసి గాయపరచడం అమానుషమైన అనాగరికమైన ఆటవికమైన చర్యని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పై మరియు పోలీసు అధికారుల పై జరిగిన దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల శివ కుమార్ ఉద్ఘాటించారు 19 04 2021నాడు స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించిన మద్దెల మాట్లాడుతూ ఈ కరోనా  ఉధృతిలో  మానవ సంబంధాలు అడుగంటి పోయిన  ఈ తరుణంలో తండ్రి కొడుకులు భార్య భర్తలు సైతం ఒకరికొకరు అంటుకోకుండా అంటరానివారుగా చూస్తున్న ఈ సమయంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్యులను వైద్య సిబ్బందిని మరియు పోలీసులను పోలీసు సిబ్బందిని దాడులు చేసి గాయపరచడం అతి హేయమైన చర్య అని దీనిని మానవతావాదులు అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలని ఈ సందర్భంగా మద్దెల ప్రభుత్వాన్ని కోరారు ఈ దాడులను ఖండించిన వారిలో మద్దెల తో పాటు సంఘ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు నాయకులు సబ్బవరపు మధుసూదన్ చిన్నికోలపూడి ధర్మరాజు అంతోటి పాల్ దేవయ్య పొన్నెకంటి సంజీవ రాజు బొమ్మిడి మల్లికార్జున్ ఉప సర్పంచ్ దుర్గేశ్ లావుడియా సత్యనారాయణ అంతోటి రాజు రఘు తోత తదితరులు పాల్గొన్నారు