హాజిపూర్ మండలం లో చీరల పంపిణీ.

Published: Thursday September 30, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 29, ప్రజాపాలన : జిల్లా లోని హాజిపూర్ మండలం ర్యాలీ ఘడ్ పూర్, చిన్నగోపాల్ పూర్, నాగారం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని గౌతమి నగర్, జాఫర్ నగర్, ఏసీసీ, ఇస్లాంపురా, 11, 25, 26, 29, 30, వార్డులలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున బతుకమ్మ కానుక చీరలను ట్రస్ట్ సెక్రటరీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ బుధవారం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ లు మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గ మహిళలకు దసరా పండగ వేళ చీరలను అందించాలని బావించి గత కొన్నేళ్లుగా  బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మరో ఏడు సంవత్సరాలు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.