కలమడుగు రేవులో మేస్త్రం వంశీయులు పూజలు పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణం

Published: Thursday January 12, 2023

జన్నారం, జనవరి 11, ప్రజాపాలన: మండలంలోని కలమడుగు గోదావరి రేవులో అత్తమడుగులో మేస్త్రి వంశీయులు పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అదిలాబాద్ జిల్లా మండలం ఇంద్రవెల్లి కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయంలోని నాగోబాకు మేస్త్రి వంశీయులు కలమడుగు లోని గోదావరిలో గల అస్తిమడుగు నుండి గంగాజలం తీసుకువెళ్లి పూజలు చేస్తారు. గోదావరి జలాన్ని తీసుకు వెళ్లేందుకు 151 మంది మేస్త్రి వంశీయులు వచ్చారు. సుమారు 80 కిలోమీటర్ల కాలినడకన బయలుదేరి మంగళవారం కలమడుగు గోదావరి రేవులో అస్తి మడుగులో చేరుకున్నారు. ముందుగా గంగ స్నానం చేసిన అనంతరం పితృదేవతలకు పూజలు చేశారు. అందరూ ఒకచోట కూర్చొని సంక్షిప్త భోజనం చేశారు. ప్రత్యేకంగా మేస్త్రి మంత్ర దగ్గర ఉండే జరిలో సేకరించిన గంగా జలంతో కేసుల కొరకు తిరుగు ప్రయాణమయ్యారు. ఉట్నూరులో బస, 11న దొరెండ, 12 నుంచి 16 వరకు విశ్రాంతి, అక్కడినుండి ఇంద్రవెల్లికి ఇందిరా దేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కేసులాపూర్ మర్రిచెట్టు వద్దకు చేరుకుంటారు.  అక్కడ సేకరించిన జలంతో ఈ నెల 17న నాగోబా ఆలయం కు చేరుకొని వెంట తెచ్చిన పవిత్ర గంగ జనంతో అభిషేకం చేసిన తర్వాత జాతర ప్రారంభమవుతుందని మేస్త్రం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి వంశీయులు ప్రధాన్ మేస్త్రం దాదా రావు, కోటాడమేశ్వరం కోసు, మేస్రం హనుమంతరావు, మేస్రం వంశ ఉద్యోగుల సంఘం సభ్యులు మేస్త్రం మనోహర్,  మేస్రం దేవరావు, మేస్రం షేకు  మేస్త్రి తుకారాం, మేస్రం నాగనాథ్, తదితరులు పాల్గొన్నారు.