ఘనంగా కౌశిక్ జన్మదిన వేడుకలు

Published: Monday December 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన : కౌశిక్ జన్మదినాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు భోజనం ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి ఎం.నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులతో కౌశిక్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా జీవితంలో మధురానుభూతిని కలిగించిందని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కరోనా కష్ట కాలంలో పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబ సభ్యులను వదిలి ప్రజల క్షేమం కోరి విధులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్వయంగా భోజనం వడ్డించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పారిశుద్ధ్య సేవకులతో కలిసి తన కుమారుడి జన్మదిన వేడుకలు జరుపుకొని వారిని గౌరవించి నందుకు గాను ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ జిల్లా ఎస్పీ నారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు, పారిశుద్ధ్య సేవకులు తదితరులు పాల్గొన్నారు