బతుకమ్మ చీరలు కాదు, భారతదేశమే కావాలి డి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.విశారదన్ మహారాజ్ డ

Published: Monday September 26, 2022

కోరుట్ల్, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి ):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చేరుకున్న పది వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర బతుకమ్మ చీరెలు మనకొద్దు ఈ భారతదేశాన్ని తెలంగాణ ను సబ్బండ కులాలు పరిపాలించాలని కావాలని డి.ఎస్.పి (దళిత్ శక్తి ప్రోగ్రాం) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. విశారదన్ మహారాజ్ అన్నారు. శనివారం అర్ధరాత్రి కోరుట్ల పట్టణానికి చేరుకున్న పది వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర  సందర్భంగా  జెండా ఆవిష్కరించి  స్వరాజ్య ఆహ్వాన సభలో మాట్లాడారు. దేశంలో యాభై కోట్ల మంది, రాష్ట్రంలో ఒక కోటి మందికి ఎలాంటి ఉపాధి లేక అభాగ్యులుగా జీవిస్తున్నారని ఇది ఈ దేశాన్నీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రకుల పాలకుల అసమర్ధ పాలనకు నిదర్శమన్నారు. తెలంగాణ గడ్డపై బీసీ ఎస్సీ ఎస్సీల స్వరాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పదివేల కిలోమీటర్ల స్వరాజ్యం పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు.అణగారిన కులాలు తమ ఓట్లు తాము వేసుకొని పరిపాలకులై ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించాలని అంబెడ్కర్ ఆశించారని అన్నారు.  ఓటు అనే వజ్రాయుధాన్ని బీసీ, ఎస్సి, ఎస్టీల చేతిలో పెట్టారని, భవిష్యత్ లో భారత రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాల స్వరాజ్యం రాబోతుందన్నారు. అంతకుముందు కోరుట్ల బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు డాక్టర్ విషాదన్ మారాజు గారి స్వరాజ పాదయాత్రకు మంగళ హారతులు భాజా భజంత్రీలతో టపాసులతో ఘనంగా స్వాగతం పలికారు.  కార్యక్రమంలో మాదిగ యువజన సంఘం అధ్యక్షులు చిట్యాల కరుణాకర్, పద్మశాలి కులోన్నతి జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్,పేట భాస్కర్, చిట్యాల లచ్చయ్య, మైనారిటీ యూత్ నాయకులు ఎండీ రహీం, బీసీ నాయకులు బింగి వెంకటేష్, అల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు ఉయ్యాల శోభన్, అంబేద్కర్ సంఘం నాయకులు చిట్యాల సాయికృష్ణ, బలవంతుల సురేష్, తలపల్లి మనోజ్, తెడ్డు విజయ్, మోర్తాడ్ నరేష్, బొల్లె అజయ్, చిట్యాల సాయికుమార్, కనుక మణిదీప్, బొల్లె మణి, చిట్యాల రాజు, నిఖిల్, యటం కృష్ణ రాజు,దొబ్బల కృష్ణ, వంక కిరణ్, కృష్ణ, చిట్యాల కిరణ్, శనిగరపు లక్ష్మినారాయణ, మరియు అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.