నిఘానేత్రంలో కోటమర్పల్లి గ్రామం

Published: Thursday February 23, 2023
 జిల్లా ఎస్పి ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 ఫిబ్రవరి ప్రజాపాలన : 100 పోలీసులకు సమానంగా ఒక్క నిఘానేత్రం పని చేస్తుందని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలోని కోటమర్పల్లి గ్రామంలో జిల్లా ఎస్పి ఎన్.కోటిరెడ్డి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్యతో కలిసి సీసీ కెమెరాల ( నిఘానేత్రాలు ) ను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్  జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేశారు. జిల్లా ఎస్పి మాట్లాడుతూ విద్యావంతులు గ్రామ అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అని కొనియాడారు. విద్యావంతులైన యువకులు గ్రామ పెద్దలు ముందుకు వస్తే గ్రామాలు ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తాయని  ఆయన అన్నారు. చంద్రయ్యను చూసి అందరూ ముందుకు వచ్చి గ్రామ అభివృద్దిలో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య మాట్లాడుతూ ఉన్నత స్థాయి అధికారులు గ్రామాలను సందర్శిస్తే గ్రామాలలో ఉన్న యువకులలో చాలా మార్పు వస్తుందని గ్రామ సర్పంచ్ ఆకాంక్షించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు సహకరించిన (దాత) అప్కని చంద్రయ్య (ఏలీయా) ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యనారాయణ, మోమిన్ పేట సిఐ వెంకటేష్,  మర్పల్లి ఎస్సై అరుణకుమార్ గ్రామ వార్డు మెంబర్లు చామల జైహింద్ రెడ్డి, రవి,లక్ష్మి, రాహుల్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ రఘుపతి రెడ్డి, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ నర్సింహ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నర్సింలు, విశ్రాంత ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి, విశ్రాంత విఆర్వో కృష్ణయ్య, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింహా, విఒఎ వినోద, తహసీన్, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, ఆనంతయ్య, రాచయ్య కావలి, జిలాని, మధు అప్కని, యాదయ్య, నర్సింహ, గ్రామస్థులు పాల్గొన్నారు.