సీర్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-1 షూటింగ్ ప్రారంభం * క్లాప్ కొట్టి షూటింగ్ ప్రార

Published: Tuesday April 04, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)
సీర్  స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రం షూటింగ్ రామంతాపూర్  డాన్ బోస్క్ స్కూల్ లో సోమవారం లాంచనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. మొదటి రోజు హీరో హీరోయిన్లపై సన్నివేశాలను చిత్రీకరించారు. డైరెక్టర్ రచయిత చేతన్ బండి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కిషోర్ తాటికొండ వెంకటరెడ్డి, రాకటి వెంకట్రామరాజు, బొమ్మినేని మనోజ్ కుమార్ రెడ్డి, హిందూపుర నిర్మాతల సారథ్యంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ తెరపై రానుంది. చిత్రం పేరు, హీరో, హీరోయిన్ పేర్లు త్వరలో ప్రకటిస్తామని డైరెక్టర్ రచయిత చేతన్ బండి తెలిపారు. డిఓపి రాజ్ కే నల్లి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా భాను పటేల్ లు వ్యవహరిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గరిక సుధాకర్ చిత్ర యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.