వడ్డెర వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి

Published: Monday April 18, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో వడ్డెర వృత్తిదారుల సమస్యలపై జిల్లా సరస్సు జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేతి వృత్తిదారుల రాష్ట్ర నాయకులు పి ఆశయ్య మాట్లాడుతూ వడ్డెర వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు వడ్డెర వృత్తిదారులకు కాంట్రాక్టు పనులు 30% రిజర్వేషన్లు ఇవ్వాలని అదేవిధంగా వడ్డెర వృత్తిదారులకు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన జాతిగా ఉందని అన్నారు వడ్డెర వృత్తిదారులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం వడ్డెర వృత్తిదారుల సంగం  రాష్ట్ర  సహాయ కార్యదర్శి పల్లపు విగ్నేష్ మాట్లాడుతూ  వడ్డెర వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా క్వారీల పైన పూర్తి హక్కులు వడ్డెర వృత్తిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు వడ్డెర వృత్తిదారుల పరిస్థితి రోజురోజుకు కడు పేదరికము మగ్గుతున్నారు వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో 2500 కోట్లు కేటాయించాలని భూమిలేని వారికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని 50 సంవత్సరాలు దాటిన వడ్డెర వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని వడ్డెర వృత్తిదారులకు ప్రమాదవశాత్తు జరిగిన చనిపోయినవారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అంతేకాకుండా వృత్తి రక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు ఇల్లు లేనివారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు పత్తి వెనుకబడిన వడ్డెర వృత్తిదారులకు 10 లక్షలు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు జిల్లా సదస్సును జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఓ ఓ సి సి ఐ నేషనల్ చీప్ అడ్వైజర్ గుంజ నరసింహ రావు ఓ సి సి ఐ నాయకులు మానయ్య సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ డేరంగుల రామకృష్ణ జిల్లా నాయకులు కొంచెం బిక్షమయ్య గోవుల రాజు కోడుదల శీను పల్లపు శివ సంపంగి సురేష్ సంపంగి నరసింహ డేరంగుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.