చదువుల తల్లి పుట్టినరోజు వేడుకలు

Published: Wednesday February 17, 2021

వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని  స్థానిక శాఖ గ్రంథాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని చదువుల తల్లి పుట్టినరోజు వేడుకల సందర్భముగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పబ్బు వెంకట రమణ, గ్రంథాలయ అధికారి పిట్టల  ఆంజనేయులు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు పంజాల పద్మ, పబ్బు లక్ష్మీనారాయణ, మహేష్, మైసొల్ల ప్రవీణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.