కమల్ రాజ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ అభయం**కమల్ రాజ్ కు బిఆర్ఎస్ లో లైన్ క్లియర్*మధిరలో దూకుడు పెం

Published: Wednesday January 11, 2023
మధిర జనవరి 10 (ప్రజా పలన ప్రతినిధి)
మధిర బిఆర్ఎస్ టికెట్ విషయంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుకు ముఖ్యమంత్రి నుండి పూర్తిగా అభయం లభించినట్లు బిఆర్ఎస్ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. సోమవారం హైదరాబాదులో జరిగిన ఖమ్మం జిల్లా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో లింగాల కమల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, లింగాల కమల్ రాజు భుజం మీద చేయి వేసి గో హెడ్ కమల్ రాజ్ అన్నట్ల తెలియటంతో బిఆర్ఎస్ నేతలు సంతోషంలో మునిగిపోతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో కమల్ రాజుకి పోటీదారులుగా  ఉన్న డాక్టర్ కోటా రాంబాబు ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి ఇద్దరూ దాదాపుగా పొంగులేటి శీనన్న వెంటనే నడిచేందుకు సిద్ధం కావడంతో కమల్ రాజుకు బిఆర్ఎస్ పార్టీలో పోటీ దారులు లేకుండా పోయింది. ఒకవైపు ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ టిఆర్ఎస్ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తూ, మరోవైపు పొంగులేటితో క్యాడర్ వెళ్లకుండా ముఖ్యమైన గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు కమల్ రాజ్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అదేవిధంగా సిపిఎం సిపిఐతో బిఆర్ఎస్ పార్టీకి పొత్తు ఉంటుంది గనుక ఆ పార్టీ నాయకులతో కూడా కలిసి పనిచేసేందుకు క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి నుండి కమల్ రాజుకి అభినందనలు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.