మధిర జనవరి 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడ స్థానిక తెలుగుదేశం పార్

Published: Friday January 27, 2023
మధిర జనవరి 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు, 74వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం  పాల్గొని, జాతీయ జెండాని ఆవిష్కరించి, భారత రాజ్యాంగ పీఠిక లో పేర్కొనబడిన సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య లక్ష్యాల నెరవేర్చకుండా పాలకులు 74 సంవత్సరాలుగా గణతంత్ర దినోత్సవ వేడుకలు లాంచనంగా మొక్కుబడిగా నిర్వహించడం వలన ప్రజలకు మౌలిక ప్రయోజనాలు అందుబాటులోకి రాలేదు.
రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలు నెరవేరినప్పుడు మాత్రమే ప్రజలు రిపబ్లిక్ వేడుకలను జాతీయ పండుగలాగా జరుపుకుంటారు లేని పక్షంలో అవి ప్రభుత్వ కార్యక్రమాలుగా మిగిలిపోతాయని నేడుత్రివర్ణ ప్రతాప్ ఆవిష్కరణ గావించిన టిడిపి రాష్ట్ర నాయకులు ఈ  సందర్భంగాా వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ అన్నారు.స్వాతంత్ర సిద్ధికి పోరాడిన  అమరవీరులకు నివాళులు అర్పించారు.
 రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే చాలా పెద్దదని, ఎందరో మహానుభావుల మేధస్సుతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన ఆ పవిత్రమైన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు పౌరులు అందరూ గౌరవించాలని కోరారు. ఇప్పుడు కేంద్ర ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి విరుద్ధంగా తప్పుడు జీవోలను తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నాయి ప్రజలను ప్రతిపక్షాలను మీడియాను అనగదొక్కాలని ధోరణితో ప్రవర్తిస్తున్నాయని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రాజ్యాంగ నికి అనుకూలముగా ప్రజలను మన్నలనుపొంది, ప్రతిపక్షాల విలువైనస్తూ సలహా సూచనలు తీసుకుంటూ పరిపాలన అందించిందని కొనియాడారు  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు, మల్లాది హనుమంతరావు, చెరుకూరి కృష్ణారావు, వంగాల రామకోటి, మేడేపల్లి రాణి, వీరమాచినేని నాగసులోచన, పగిడిపల్లి విజయమ్మ, గడ్డం మల్లికార్జునరావు, అనూమొలు సతీష్, పాశం రామనాథం, కొనీరు రాణి, మేడ వెంకటేశ్వరరావు, గద్దల ప్రకాశరావు, స్థిరపంగా ఆశీర్వాదం, స్వామి, నాగులంచ శ్రీనివాసరావు, పరిమి బెంజిమెన్, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.