పంట సాగు , ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి

Published: Monday December 06, 2021

ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

జగిత్యాల, డిసెంబర్ 5 ( ప్రజాపాలన ప్రతినిధి): పంట సాగు, ధాన్యం కొనుగోళ్లలో స్పష్టత ఇవ్వకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని, హాలిడే కొనసాగిన కాలానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతు ఉద్యమనేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. ఆదివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల ప్రతినిధుల తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు ఉద్యమ నేత ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టం రద్దు, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల చట్టం కోసం రైతులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మానుకొని వెంటనే రైతులకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయాలని లేకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉదృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు ప్రజా సంఘాల, సమాఖ్య నాయకులు మ్యాడద తిరుపతి రెడ్డి, వెల్దండి గౌతమ్ రెడ్డి, కనపర్తి లింగారావు, కెమ్మసారపు సురేష్, దేవేందర్ రెడ్డి, వేణు, రాజేందర్, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘాల అధ్యక్షుడు తాటిపెల్లి రాజన్న, జ్ అల్లాడి తిరుపతి రావు, కిషన్ రెడ్డి, గాజుల రాజు, జుర్రు మల్లేశం, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.