విఆర్ఎల సమస్యలు తక్షణం పరిష్కరించాలి టి పి సి సి నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్

Published: Friday August 05, 2022

కోరుట్ల, ఆగస్టు 04 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఏ ఉద్యోగులు కూడా సమ్మె చేసే పరిస్థితి ఉత్పన్నం కాబోదని ఇకముందు సమ్మె చేసే పరిస్థితి ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని దీంతో తమ జీవితాలు బాగు పడతాయని భావించిన యావత్ తెలంగాణ ప్రజల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏలు భావించి తెలంగాణ సాధన పోరాటంలో అహోరాత్రులు కష్టపడ్డారని కానీ నేడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం విఆర్ ఏ లను చిన్నచూపు చూస్తున్నదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.గురువారం రోజున కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మరియు మెట్పల్లి డివిజన్ లోని వీఆర్ఏలు చేస్తున్న సామూహిక దీక్షా శిబిరాలను కృష్ణారావు సందర్శించిన అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లో విఆర్ ఎలా పాత్రప్రశంసించ తగినదని తెలంగాణ రాష్ట్రాన్ని సత్యాగ్రహ దీక్షలు ధర్నాలు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సకల జనుల సమ్మె తదితరాల ద్వారా సాధించుకున్నా మని మాట్లాడిన కోరుట్ల నియోజకవర్గంలో నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికైన టువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల నియోజకవర్గంలో వీఆర్ఏలు గత 11 రోజులుగా దీక్షలు చేస్తున్నా దీక్షా శిబిరాలను సందర్శించకుండా వీఆర్ఏలకు సంఘీభావం తెలుపకుండా నిమ్మకు నీరెత్తినట్లు స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించడం బాధాకరమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే తక్షణం దీక్ష శిబిరాన్ని సందర్శించి వీఆర్ఏలకు సంఘీభావం తెలిపి సమస్య తీవ్రతను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చి తక్షణం పరిష్కరించాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధన కోసం గత 11 రోజులుగా దీక్ష చేయాల్సిన పరిస్థితుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు విఆర్ ఏ ల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ శాసన సభలో ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కి విఆర్ ఏ లను పట్టించుకోవడం లేదనిన వీఆర్ఏ ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ఇది సమంజసం కాదని రెవెన్యూ వ్యవస్థకు పాలనా వ్యవస్థకు మూల స్తంభాల లాంటివారు వీఆర్ఏ ల ని జువ్వాడి కృష్ణారావు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను తక్షణం పరిష్కరి స్తుందని వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైన వణి ఈ డిమాండ్ లను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తుందని జువ్వాడి కృష్ణారావు అన్నారు జువ్వాడి కృష్ణారావు వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి మెట్టుపల్లి మండలకాంగ్రెస్ అధ్యక్షులు అంజిరెడ్డి కోరుట్ల పట్టణఅధ్యక్షులు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు నయీమ్ సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నర్సక్క సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందే మారుతీ యూత్ మెట్టుపల్లి పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ భాస్కర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మ్యాదరి లక్ష్మణ్ దాసరి బాబు షకీల్ తదితరులు ఉన్నారు.