ఆంజనేయస్వామి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి ** కలెక్టర్ భోర్కడే హేమంత్ సహాదేవరావు కు వి

Published: Tuesday April 04, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 3 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ ఆంజనేయ ఆలయ సమీప గ్రామాల వారికి ఉపయోగపడే రోడ్డు నిర్మించాలని ఆలయ భక్తులు, సమీప గ్రామస్తులు, సోమవారం రహదారి పనులను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ వాసుదేవరావు కు వినతి పత్రం అందజేశారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, జెడ్పిటిసి,అరిగెల నాగేశ్వర్ రావు, అభ్యర్థన మేరకు జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పాయి, రాజేశం లతో కలిసి జాతీయ రహదారి పనులలోని ఆంజనేయస్వామి రహదారినీ పరిశీలించారు. సర్వీస్ రోడ్డు లేకుంటే ప్రజలకు అసౌకర్యం కలిగే రీతిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి తోపాటు అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, సంబంధిత ఇంజనీర్లను నిలదీశారు. పెద్దబాబు పాత వంతెన నుండి కేసులాపూర్, రాజు రా లకు వెళ్లి వచ్చేందుకు జాతీయ రహదారి కల్పించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రహదారిని ఏర్పాటు చేసి ప్రజలకు సదుపాయం కల్పించాలని సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ధర్మపురి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు గుండా వెంకన్న, ఎక్కిరాల శ్రీనివాస్, మురళి గౌడ్, డాక్టర్ రమేష్, ప్రకాష్ గౌడ్, కేస్లాపూర్, రాజుల, గ్రామస్తులు పాల్గొన్నారు.