కానిస్టేబుల్ శాంత కుమార్ కి సేవా పురస్కారంవైరా ఏసీపీ రెహమాన్ చేతులు మీదుగా క్యాష్ రివార్డు

Published: Thursday December 01, 2022
మధిర రూరల్ నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు స్థానిక మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయంలోని ఇన్ వార్డులో పనిచేస్తున్న కానిస్టేబుల్ శాంత కుమార్ కి సేవా పురస్కారంతో పాటు క్యాస్ రివార్డు లభించింది. సర్కిల్ కార్యాలయం ఇన్ వార్డులో పనిచేస్తున్న కానిస్టేబుల్ శాంత కుమార్ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఉన్నతాధికారులకు కావలసిన సమాచారాన్ని తక్షణమే అందిస్తున్న కానిస్టేబుల్ శాంతి కుమార్ వైరా ఏసిపి రెహమాన్ చేతుల మీదుగా సేవా పురస్కారంతో పాటు క్యాష్ రివార్డు అందుకున్నారు. సేవా పురస్కారాన్ని అందుకున్న కానిస్టేబుల్ శాంతి కుమార్ ని మధిర సీఐ మురళి అభినందించారు.