తూర్పు తండా బతుకమ్మ సంబరాల్లో బోనకల్ ఎస్సై కవిత ఎస్సై కవితను పూలవర్షంతో ఘన స్వాగతం పలికిన మ

Published: Tuesday October 04, 2022

బోనకల్, అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ తూర్పు తండాలో  ఆదివారం రాత్రి ఎనిమిదవ రోజు  బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోనకల్ ఎస్సై తేజావత్ కవిత కుటుంబ సమేతంగా హాజరైనారు. అనంతరం ఎస్సై కవితను తూర్పు తండా మహిళలు పూల వర్షంతో ఘన స్వాగతం పలుకుతూ  శాలువాతో సత్కరించారు. బతుకమ్మ సంబరాల్లో హాజరైన ఎస్సై కవిత కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మహిళలతో , చిన్నపిల్లలతో బతుకమ్మ, కోలాటం ఆడారు. అనంతరం మహిళలు ఆడుతున్న బతుకమ్మ, కోలాట నృత్యాలను ఎస్సై కుటుంబ సమేతంగా ప్రత్యేకంగా తిలకించారు.  తొమ్మిది రోజులపాటు జరుపుకునే బతుకమ్మ సంబురాలలో భాగంగా ఎనిమిదవ  రోజున వెన్నుముద్దల బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి తెలంగాణ సంసృతి, సాప్రదాయాలను చాటారు.  మహిళలు పాడిన పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం మండల కార్యదర్శి అజ్మీర గోపి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ముడావత్ సైదా, ఆజ్మీరా రాము, అజ్మీర చిరంజీవి, అజ్మీర శ్రీరాములు, గణపారపు వెంకటేశ్వర్లు, అజ్మీర కృష్ణ, భూక్యా చిరంజీవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్యా బద్రు నాయక్, తూర్పు తండా పెద్దలు అజ్మీర మోతిలాల్, లచ్చిరాం, కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నల్లు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.