పోడు భూముల సమస్యల గురించి జిల్లాస్థాయి విస్తృత సమావేశం

Published: Wednesday September 21, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీ దురిశెట్టి అనుదీప్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు... తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో  పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,
పోడు భూముల సమస్య పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అనుసరించి సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసిందన్నారు, అందులో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు, జిల్లాల అడవి సంపదను సంరక్షించుకోవడంతో పాటు అర్హులైన పోడు సాగుదారులకు పట్టాల అందరికీ హక్కు కల్పించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తాత మధుగారు, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వర్లు గారు, ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ గారు, అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మెచ్చ నాగేశ్వరరావు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కోరం కనకయ్య గారు, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు, జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ గారు, భద్రాచలం ITDA PO శ్రీ గౌతమ్ పోట్రు గారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు గారు, జిల్లా ఫారెస్ట్ అధికారి DFO శ్రీ రంజిత్ నాయక్ గారు జిల్లా ఉన్నతాధికారులు పలు శాఖల ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు*...