దోమల మందు పిచికారి

Published: Thursday September 16, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్లు మండలం గోవిందపురం ఎ గ్రామంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా దోమల మందును సర్పంచ్ భాగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాగింగు చేయడమైనది. దోమలను నివారించేందుకు గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఇళ్లలో మురికి నీరు నిల్వ లేకుండా చూడాలని అదేవిధంగా దోమలు గుడ్లు పెట్టకుండా లార్వా నషించేందుకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు రాకుండా చూడాలని గ్రామ ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తూ దోమల నియంత్రణ చర్యలు చేపట్టనైనది. గ్రామంలో రోడ్డు పక్కన మొక్కలు నాటే భాగంగా ఒక రైతు ఉప్పగళ్ల వెంకట్రామయ్య స్వచ్ఛందంగా మొక్కలను నాటి వాటికి పాదులు కంచేను శ్రమదానం చేస్తూ దత్తాత మొక్కలు గాచేసి ఆదర్శంగా నిలిచినాడు వారిని సర్పంచ్ భాగం శ్రీనివాసరావు గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగం శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి బిందు మల్టీపర్పస్ వర్కర్లు గ్రామ పంచాయతీ  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.