డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తే సహించేది లేదు

Published: Thursday February 03, 2022
ఇబ్రహీంపట్నం పిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : నిన్న కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు మాట్లాడుతూ భారత ప్రజల ఆశాజ్యోతి భారత ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కే సి ఆర్ గారు వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని అలాగే ప్రపంచం లొనే అతి పెద్ద భారత ప్రజాసామ్య రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగాన్ని దాన్ని రాసిన దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ ను అవమాన పరచడమే అని దీనిని భారతీయ ఎస్సిమోర్చా తీవ్రంగా వ్యతిరేఖిస్తుందని ఇది ఏమైనప్పటికి ఆదినుండి దళిత వ్యతిరేకి అయిన కేసీఆర్ దళిత జాతికి మొత్తం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాలలో నిత్యం దళితులకు  వ్యతిరేఖంగానే పని చేస్తుందని ఏనాడు అంబేద్కర్ జయంతి వర్ధంతి కి కనీసం పూల మాల వేసి నివాళులర్పించని కెసీఆర్ ఇలా మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. భారత రాజ్యాంగాన్ని అంబెడ్కర్ ను అవమాన పరిచిన కేసీఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.