మూలమాడ గ్రామంలో మోరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

Published: Monday June 06, 2022
సర్పంచ్ కందాడ సుభాన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 జూన్ ప్రజాపాలన : వర్షాకాలంలో మూసీనది పొంగి పొర్లి పొలాల గుండా ఊరి మధ్యలోకి వర్షపు నీరు వస్తున్నదని గ్రామ సర్పంచ్ కందాడ సుభాన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నవాబుపేట్ మండల పరిధిలోని మూలమాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ కందాడ సుభాన్ రెడ్డి ఉప సర్పంచ్ ముష్టి శ్రీనివాస్ యాదవ్ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ లు ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మూలమాడ గ్రామం పారిశుద్ధ్య రహిత గ్రామంగా రూపాంతరం చెందిందని సంతోషం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టకపోతే ప్రతి పల్లె చెత్తా చెదారంతో నిండి ఉండేదని గుర్తు చేశారు. మోరీలు నిండుకుండలా తలపించి దోమలకు ఆవాస కేంద్రాలుగా మారి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉండేదని చెప్పారు. నేడు పల్లె ప్రగతి తో మా ఊరు పారిశుద్ధ్య రహిత గ్రామంగా అభివృద్ధి చెందిందని చెప్పుటకు సంతోషిస్తున్నానని వివరించారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ప్రత్యేక కృషి కొనియాడదగినదని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మా ఊరి పర్యటనకు వచ్చినప్పుడు మోరి నిర్మాణానికి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే జెడ్ పి టి సి ఎంపీటీసీ ప్రత్యేక చొరవ చూపి మూలమాడ గ్రామాభివృద్ధికి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. మోడీ నిర్మాణం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుమిత్ర ఆశా వర్కర్ కె. అరుణ కారోబార్ సి. రవీందర్ వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area