కుక్కల బెడద నివారణకై తగు చర్యలు తీసుకోవాలి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ఓ కు వినతి పత్రం

Published: Friday February 03, 2023

బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో కుక్కల బెడద నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, కుక్కల బెడద విపరీతంగా ఉన్నదని, గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్లాలన్న, పాఠశాలకు వెళుతున్నప్పుడు వెంబడిస్తున్నాయని, ఇలా వెంబడించడం వలన కుక్క కాటుకు లోనే భయపడుతున్నారని, ద్విచక్ర వాహనదారులను వెంబడించి కరుస్తున్నాయని, ఏ వీధికి వెళ్ళిన పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయని, వీటి బెడద మరింత పెరగకముందే వాటిని పట్టించాలని బోనకల్ మండల పరిషత్ అధికారి సుబ్రహ్మణ్య శాస్త్రి కి సిపిఎం బోనకల్ గ్రామశాఖా ఆధ్వర్యంలో గురువారం రెండవసారి వినతి పత్రం సమర్పించారు. గతంలో నవంబర్ 25వ తారీకు మొదటిసారి వినతిపత్రం ఇచ్చామని ఇంతవరకు దానిపై చర్య తీసుకోలేదని, ఎంపీ ఓ స్పందిస్తూ ఈనెల చివరికల్లా మీ గ్రామంలో కుక్కల బెడద నివారణకై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస్, మాజీ కార్యదర్శి చెన్న లక్షాద్రి ,బోనకల్ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు బిల్లా విశ్వనాథం, సిపిఎం నాయకులు గద్దె రామారావు తదితరులు పాల్గొన్నారు.