తెలంగాణ మీద విషం కక్కుతున్న మోడీ జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకో : కార్పొరేటర్ నాగేందర్ యాదవ

Published: Thursday February 10, 2022

శేరిలింగంపల్లి -ప్రజాపాలన/న్యూస్ : తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పోరేట్ ర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టరు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు. అయ్యా మోడీ మా తెలంగాణ మీద విషం కక్కినవ్ మహోన్నతమైన ఉద్యమంలో ఏనాడూ కనిపించని మీ మొకం ఈనాడు సగౌరవంగా తలెత్తుకుని నిలబడ్డ నాలుగు కోట్ల తెలంగాణ సమాజాన్ని ఈర్ష్య, అసూయలతో విభజన అశాస్త్రీయం అంటున్నవ్.... ఉమ్మడి మహారాష్ట్ర నుండి మీ గుజరాత్ వీడినప్పటి నుండి బాగుపడ్డది ఇద్దరే వారు అంబానీ, అదానీ... కానీ మా కేసీఆర్ వల్ల మా ప్రజలంతా ప్రతి ఒక్క పథకంతో తృప్తి పడుతున్నారు 7 ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారు మరియు గుజరాత్ కంటే ఎక్కువగా డెవలప్ అవుతుందని తట్టుకోలేక రాష్ట్రం పై విషం కక్కుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకే మా ప్రజలు మిమ్మల్ని దిష్టిబొమ్మల్లో మంటపెడుతున్నరు అని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీ కళ, పర్వీన్ బేగం, కవిత గోపి, సీనియర్ నాయకులు రామచందర్, గోపాల్ యాదవ్, శ్రీకాంత్, రాజు, రవీందర్, పిల్లి యాదగిరి, రమేష్, నర్సింహ రెడ్డి, నయీం, సాయి, నర్సింహ, సత్యనారాయణ, జమ్మయ, రజినీ, సౌజన్య, కల్యాణి, చంద్రకళ, నాజియ, జయ భాగ్య, కుమారి, గౌసియా, బస్తి కమిటీ అధ్యక్షులు, బస్తి కమిటీ సభ్యులు, మహిళ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.