ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పై యుద్ధానికి సిద్ధం కారుమంచి యాకోబు

Published: Wednesday June 29, 2022
సడక్ బంద్ ను విజయవంతం చేయాలని మాదిగల మహా గర్జన విజయవంతం చేయాలని వైరా మండల కేంద్రంలో గల గన్నవరం గ్రామంలో సడక్ బంద్ చలో హైదరాబాద్ విజయవంతానికి కరపత్ర ఆవిష్కరణ ఎం ఎస్ పి మండల కన్వీనర్ కారుమంచి యాకోబు మాదిగ గారు మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని వర్గీకరణకు బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 8 సంవత్సరాలు దాటిన పార్లమెంట్లోని ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టకుండా జాప్యం చేస్తున్నారని అందువలన మాదిగలకు మాదిగ ఉప కులాలకు తీరని నష్టం జరుగుచున్నదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం స్పందించి వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మహాజన సోషలిస్ట్ పార్టీ మండల ఇన్చార్జి మాగంటి బాబురావు మాదిగ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఎన్ డి ఏ మిత్రబక్షమైన ఇతర వామపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సమర్థించాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో పూర్తి మెజార్టీతో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇంతవరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టక పోవడం దురదృష్టకరం అని వాపోయారు ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు కారుమంచి వెంకయ్య గారు మాదిగ మరియు కారుమంచి రవి మాదిగ కారుమంచి జీవరత్నం కిన్నెర రమేష్ లతా భవాని పొన్నమ్మ సునీత ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
 
 
 సామాజిక ఉద్యమ నమస్కారాలతో. మహాజన సోషలిస్ట్ పార్టీ. వైరా మండల కన్వీనర్ .కారు మంచి యాకోబు మాదిగ