* అంగన్వాడి ఉద్యోగులకు కనీసవేతనం,పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలి** సిఐటియు రంగారెడ్డి

Published: Saturday January 28, 2023
చేవెళ్ల జనవరి 27,(ప్రజాపాలన):-

అంగన్వాడి  టీచర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేవెళ్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అలీ దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70000 మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువ మంది, గత 40 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని. వీరికి కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవీ ప్రభుత్వం నేటికీ కల్పించలేదు దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు మన పక్కనే ఉన్న తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో హెల్త్ కార్డులు కూడా ఇచ్చారు పశ్చిమ బెంగాల్ కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఐదు లక్షలు హెల్పర్లకు 300000 ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని అన్నారు పై సమస్యలన్నీ పరిష్కరించని ఎడల మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా కోశాధికారి లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు ఉమా కల్పన ప్రేమలత స్వప్న మంగమ్మ రాధా మల్లీశ్వరి అంగన్వాడీ టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు