రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

Published: Tuesday May 11, 2021

గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
పరిగి, మే 10, ప్రజా పాలన ప్రతినిధి : లoబాడి గిరిజన రైతుని భయబ్రాంతులకు గురి చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్న మాడుగుల పోలీస్ స్టేషన్ సీఐ ని వెంటనే విధుల నుంచి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలి. అదేవిధంగా బూటు కాళ్లతో కొడుతూ తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్న మాడుగుల మండలం బీజేపీ అధ్యక్షుడు పెద్ద యాదవ్ పై మరియు అతని సహచరులు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. పేద ధనిక అనే బేధం లేకుండా చట్టాన్ని రక్షించాల్సిన ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి ప్రజలను రైతులను ఆదుకునే క్రమంగా వెళ్ళవలసిన అధికారులు డబ్బులకు అమ్ముడు పోయి లంబాడి గిరిజనుల అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటు ఇలాంటి అవినీతిపరులను గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను కోరడమైనది. ఇట్టి విషయమై చర్యలు తీసుకొని ఎడల రాష్ట్రంలోని లంబాడి గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని. బిజెపి కార్యాలయం ముట్టడి తో పాటు డిజిపి కార్యాలయం ముట్టడి చేయవలసి వస్తుందని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు..