అంగరంగ వైభవంగా మట్టి గణపయ్య విగ్రహ ప్రతిస్టాపన

Published: Thursday September 01, 2022
కరీంనగర్  ఆగస్టు  ప్రజాపాలన 31 :
 

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించాలని ఆ‌సంఘం జిల్లా అధ్యకుడు మారం జగదీశ్వర్ అన్నారు.బుధవారం  నగరంలోని టీఎన్జీవో భవన్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో వినాయకుని‌ విగ్రాహ ప్రతిస్టాపన చేశారు. అనంతరం జగదీశ్వర్ మట్లాడుతూ

  హిందువుల ముఖ్య పర్వదిన  వినాయక చవితి ఎంతో పవిత్రమైందన్నారు. భవనంలో మట్టి గణపతి విగ్రహా వితరణే ఎంతో‌శ్రేయోష్కరమైందన్నారు.ప్రతి ఇంటలో  మట్టి‌ వినాయక‌ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మట్టి గణపతి పూజించి మన పర్యావరణాన్ని మనం రక్షించుకునే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు వివరించారు ఇట్టి కార్యక్రమంలో టిఎన్జీవోల సంఘం కార్యదర్శి దారం శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ మనమిత్ రూరల్ డివిజన్ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి నేరెళ్ల కిషన్ నాయకులు శ్రీధర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.