విద్యార్థుల ప్రతిభ గుర్తించిన ఉపాధ్యాయులు

Published: Thursday March 31, 2022

రాయికల్, మార్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న మొకినపలి రామ్ చరణ్, కల్లెడ హరీష్ అనే విద్యార్థులు మండే ఎండ, తరగతిగదిలో ఉక్కపోత నివారణకు, తమకు గాలి రావడానికి విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి అట్టముక్కలు, విరిగిన షటిల్ బ్యాట్ కర్ర, చిన్న చిన్న పరికరాలు, హెచ్.డబ్ల్యు.బ్యాటరీ, చిన్న వైరు ముక్కలు ఉపయోగించి తమలోని ప్రతిభకు పదును పెడుతూ ఫ్యానులు తయారు చేసి గాలి వీచేలా ఏర్పాటు చేసుకున్నారు లో కాస్ట్ నో కాస్ట్ సామాగ్రిని ఉపయోగించి పిల్లలు తయారు చేసిన వస్తువులను బుధవారం పాఠశాలలో ప్రదర్శించారు. పిల్లల సృజనాత్మకతను ఉపాధ్యాయులు చేరుకు మహేశ్వర శర్మ, ముక్కెర శేఖర్, ఎ.రమేష్, ఎం.శాంతకుమారి, వి.మధు ఎన్.నాగరాజు, సంపత్ కుమార్ లు విద్యార్థులను అభినందించారు.