బంగారం దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Tuesday November 08, 2022
బెల్లంపల్లి నవంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వ వార్డులో సంస్కృతి  మహిళా గ్యాలరీ బంగారం షాపును సోమవారం  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అన్ని రకాల షాపులు బెల్లంపల్లి పట్టణంలో అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు,  నూతన వరవడితో "సంస్కృతి" మహిళా గ్యాలరీ బంగారం షాపును ప్రారంభించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్ బి, సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తాండూరు మాజీ జడ్పీటీసీ సురేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డు నారాయణ,  వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ , అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, టిఆర్ఎస్ టీబీజీకేఎస్  నాయకులు శ్రీనివాస్, మోహన్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.