మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాల

Published: Thursday February 10, 2022
వైరా : మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి గౌతమ్ కోరారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు మున్సిపాలిటీలోని సమీకృత వెజ్ నాన్వెజ్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ను మున్సిపాలిటీ మెయిన్రోడ్డులోని డ్రైనేజీ నిర్మాణ పనులను ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను అధికారులను కోరారు అనంతరం వైరా మండలం గొల్లపూడి గ్రామంలోని ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని ఎలా అందిస్తున్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటపతిరాజు ఎమ్మార్వో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు