మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం : ప్రధానోపాధ్యాయులు దీవి సాయికృష్ణమాచార్యులు

Published: Friday July 16, 2021
 మధిర, జూలై 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో ఈరోజు హరితహారంలో భాగంగా సుమారుగా 25 పండ్ల, పూల మొక్కలు నాటటం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీసాయి కృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు సమస్త మానవాళికి మొక్కలు జీవనాధారం అని అటువంటి మొక్కలు పెంచటం ద్వారా స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, పండ్ల మొక్కల ద్వారా కలుషితం లేని చక్కని పండ్లు లభిస్తాయి కావున అందరు మొక్కల పెంపకం ఒక అలవాటుగా చేసుకోవాలని సాయికృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాం, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహమ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.