రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం: తెలంగాణ రైతు సంఘం.

Published: Friday October 28, 2022

శంకరపట్నం అక్టోబర్ 27 ప్రజాపాలన:

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే పనిలో నిమగ్నమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెసరు కాయల జంగారెడ్డి గురువారం రోజున శంకరపట్నం మండల కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో మల్లు స్వరాజ్యం నగర్ లంబు గోపాల్ రెడ్డి ప్రాంగణంలో తెలంగాణ రైతు సంఘం ఎనిమిదో మహాసభలు ప్రారంభమయ్యాయి.
ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై జంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్పొరేట్లకు ధనవంతులకు లాబించే విధంగా చట్టాలు చేస్తుందని అన్నారు. రైతులకు రెట్టింపు ఆదాయం సమకూరుస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం నీటి మూటలే అయిందన్నారు.
పైగా ఎరువులు,పురుగుమందుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచారని అన్నారు. ఎరువుల సబ్సిడీని ఎత్తివేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టు సీటు ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పనంగా అప్పజెప్పే కుట్రలో భాగంగానే మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చిందని, రైతులు ఐక్య ఉద్యమాల ద్వారా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని లో చేసిన చారిత్రాత్మకమైన పోరాటం మోడీ మెడలు వంచిందని,జాతికి క్షమాపణ చెప్పే విధంగా పోరాటం జరిగిందని భవిష్యత్తులో మరో రూపంలో రద్దు చేసిన చట్టాలను మళ్లీ తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నారని అలా జరిగితే పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమిస్తుందని హెచ్చరించారు.విద్యుత్ సంస్కరణ లా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్ల బిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని పరిష్కారం కానీ భూ సమస్యలను సాదా బైనామాలను వెంటనే పరిష్కరించాలని మార్కెట్లో ఐకెపి సెంటర్లలో దోపిడిని అరికట్టాలని సన్నా చిన్న రైతులకు ఎరువులు పురుగుమందులు యంత్రాలు పనిముట్లు ఉచితంగా సరఫరా చేయాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 3000 పెన్షన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా వరి కోతలు మొదలైనప్పటికీ ఐకెపి కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదని వెంటనే ప్రారంభించి సజావుగా కొనుగోలు జరిగే విధంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని లేనియెడల రైతాంగ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మహాసభల అధ్యక్ష వర్గంగా వర్ణ వెంకటరెడ్డి బాసిరా సంపత్ రావు లు వ్యవహరించారు.ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమారెడ్డి రాజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శీలం అశోక్ గుండేటి వాసుదేవ్ సహాయ కార్యదర్శులు జనార్దన్ రెడ్డి కోశాధికారి బాసర సంపత్ రావు నాయకులు కాయిత లింగారెడ్డి పప్పు నారాయణ రాములు రమేష్ ఒక నిమిషం రాజు అంజయ్య నారాయణరెడ్డి మొగిలి రజిత లక్ష్మీ  యమునా లతోపాటు 150 మంది రైతు ప్రతినిధులు పాల్గొన్నారు