క్షయవ్యాధి రహిత నగర నిర్మాణమే లక్ష్యం మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Friday April 14, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సభ్యులతో క్షయవ్యాధి వ్యాప్తి మరియు నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మాట్లాడుతూ పీర్జాదిగూడ నగర పరిధిలో క్షయవ్యాధిని అంతంచేయడానికి క్షయ రహిత సమాజ నిర్మాణానికి తమవంతు బాధ్యతగా భావించి ప్రజలు సహకరించాలని సూచించారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువజన సంఘాలు సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. ఇందుకోసం 
డబ్ల్యూహెచ్వో వారి సహకారంతో క్షయ  వ్యాప్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాది నిర్ధారణ, నివారణ కొరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వార్డ్ కమిటీ కమిటీ సభ్యులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల అందరి భాగస్వామ్యంతో నగర ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు క్షయ రహిత పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చదిద్దనున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా డబ్ల్యూహెచ్వో  ప్రతినిధులు మాట్లాడుతూ క్షయ అంటువ్యాధి, క్షయ వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది అని, రెండు వారాల పైబడి దగ్గు, సాయంత్రం పూట జ్వరము, ఆకలి మందగించడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లయితే తెమడ పరీక్షలో క్షయ నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి నుండి డాట్స్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్షయ స్పెషలిస్ట్ డాక్టర్ రవీందర్ కుమార్, నేషనల్ ప్రొఫెషనల్ ఆఫీసర్, క్షయ డబ్ల్యూహెచ్ఓ ఇండియా డాక్టర్ మాలిక్ ఫర్మాన్, నేషనల్ కన్సల్టెంట్, క్షయ డబ్ల్యూహెచ్వో  ఇండియా డాక్టర్ సందీప్ చౌహన్,
 తెలంగాణ క్షయ జాయింట్ డైరెక్టర్
 డాక్టర్ రాజేశం, డాక్టర్ మహేష్, డాక్టర్ శ్రీఘన, మేనేజర్ జ్యోతి, సానిటరీ ఇస్పెక్టర్ జానకి, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ విక్టర్, ఇంజనీర్ మురళి, నాయకులు బండారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.