మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన...

Published: Friday February 04, 2022
ఎర్రుపాలెం ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బనిగండ్లపాడు లో మాధకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి అధ్యక్షన జరిగిన కార్యక్రమంలో ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ గోపాలరావు, కానిస్టేబుల్ ప్రకాష్ పాల్గొని ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్‌ కు అలవాటుపడిన వారి మెదడు మొద్దుబారి, తాము ఏమీ చేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి, విచక్షణ కోల్పోయి, తల్లిదండ్రలను ఎదిరిస్తూ, ప్రేమ పేరుతో బాలికల్ని వేధిస్తూ, పోక్సో కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల వైపు యువత ఎవ్వరూ ఆకర్షితులు కావద్దని, లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. యువత మత్తుకు బానిసలుగా కాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.