సర్పంచ్ సంధ్యారాణి బ్రహ్మారెడ్డి వివాహ వేడుక..

Published: Friday April 29, 2022
తల్లాడ, ఏప్రిల్ 28 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి, బ్రహ్మారెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుక గురువారం జరిగింది. ఈ సందర్భంగా వైరా సాయి నగర్ లోని బాలవెలుగు ఆశ్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య, కాంగ్రెస్ నాయకులు సీతారాములు, వేమూరి అజయ్, పల్లెపు కొండలు, రాలాపల్లి సతీష్, మామిళ్ళపల్లి విజయ్ పాల్గొన్నారు.