పోషణ పక్షంలోభాగంగా యోగ పౌష్టికాహారం అవగాహన ర్యాలీ ?

Published: Thursday March 25, 2021
గొల్లపల్లి, మార్చి 24 (ప్రజపాలన ప్రతినిధి): ​గొల్లపల్లి మండలం తిరుమలపురం (పీడీ) గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ పక్వాడా పక్షములో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గర్భిణీలు బాలింతలు ఎదిగే పిల్లలు యుక్త వయస్సు యువతి యువకులకు యోగ ధ్యానం వాకింగ్ అభ్యాసన ప్రయోజనాలు వివరించి. ప్రతి ఇంటి ఆవరణ పరిసరాల్లో పరిశుభ్రత కల్గివుండాలి ఆడ మగ తేడా లేకుండా ఐరన్ తోకూడిన ఆహారం బెల్లం పల్లిలు పాలు గోరువెచ్చని నీరు తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు పోషకహారాలుతప్పని సరి తినాలి ప్రతి సంద్భంలో​చేతులు సబ్బు లేదా సానిటైజర్ చే శుభ్రం చేసుకుంటు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధిగా మస్కు ధరించి కోవిడ్-19 నిబంధనలు అందరూ పాటిం చాలని అవగాహన కల్పించారూ.​ ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ చిలుకమ్మ అంగన్వాడి టీచరులు లాల్బీ లలిత హరిత ఆయాలు రాజవ్వ రజిత రమ్యశ్రీ ఆశ వర్కర్లు వసంత మంగ ఉమ పిల్లలు తల్లులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.