జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలు

Published: Thursday February 03, 2022
జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లాలో శాంతిభద్రతల దృశ్య, ప్రశాంతతను పెంపొందించేందుకు ఫిబ్రవరి 28 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ కే సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ 30 పోలీస్ ఆర్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజినల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎలాంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు, జరుప రాదన్నారు. నిషేధిత ఆయుధాలైన కత్తులు, కర్రలు,చాకులు, తుపాకులు, పేలుడు, పదార్థాలు, ఏలాంటి ఆయుధాలను వాడ రాదన్నారు. పైన తెలిపిన నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, మిలటరీ అధికారులకు, హోంగార్డులకు, అంత్యక్రియ ఊరేగింపులకు, మినహాయింపు వచ్చిందన్నారు. పోలీస్ ఆప్స్ అమల్లో ఉన్నందున జిల్లా ప్రజలందరూ ప్రశాంతతను పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు సహకరించాలని జిల్లా ఎస్పి కోరారు.