శంకరపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకరపట్నం, ఫిబ్రవరి 27ప్

Published: Tuesday February 28, 2023
మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ శంకరపట్నం మండలంలోని తాడికల్ వంకాయ గూడెం కేశవపట్నం గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగాకళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడిన దళిత సంఘం నాయకుడు బూర్ల మొగిలిని ఎమ్మెల్యే పరమర్శించి, ఆరోగ్యం పరిస్థితులు అడిగి ఓదార్పును ఇచ్చాడు. పలు గ్రామాలకు గాను సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినసందర్భంగా మండల కేంద్రంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకిషన్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిది ఏళ్లుగా రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి ఇళ్లలో పెద్ద దిక్కై వెలుగుచున్నారని అన్నారు.   రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నరన్నారు. పేదల ఆర్థిక అభివృద్ధికై పలు సంక్షేమ  పథకాలైన కళ్యాణ లక్ష్మి,రైతుబంధు, రైతు బీమా,దళిత బంధు,  రాష్ట్రంలో ప్రవేశపెట్టి విజయవంతంగా వాటిని నెరవేర్చి ఇప్పుడు ఆ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ నడుం బిగించి  ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, సర్పంచులు గుర్రం లతసంపత్, దాసరిభద్రయ్య, చుక్కలరవి, ఎంపీటీసీ ఎస్‌కే మోయిన్,  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరస్వామి, కేశవపట్నం రైతుబంధు సముతి అధ్యక్షుడు కొత్తపెళ్లి రవి యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ మోత్కూరి సమ్మయ్య ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.