హస్తకళలను ఆదరిద్దాం... చేనేతలను ప్రోత్సహిద్దాం

Published: Monday February 14, 2022
కళాసంస్కృతి అధ్యక్ష కార్యదర్శులు శివకాళి లక్ష్మణ్ రావు
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : హస్తకళలను ఆదరించి చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని కళాసంస్కృతి చేనేత హస్తకళా మేళా అధ్యక్షుడు శివకాళీ, కార్యదర్శి లక్ష్మణ్ రావులు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫతే గార్డెన్ లో అఖిల భారత హస్తకళా చేనేత వస్త్ర్ర ప్రదర్శన, అమ్మకం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి మాట్లాడుతూ నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలు సరసమైన ధరలకు లభించునని పేర్కొన్నారు. అందమైన ఆకర్షణీయమైన హస్త కళారూపాలు, గృహోపకరణాలు చౌకధరలకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 2 టాప్స్ రూ. 500, 2 శారీస్ రూ.500, 2 షర్ట్స్ రూ.500, 3 షర్ట్స్ బిట్స్ రూ.1000 లకు విక్రయించబడునని వివరించారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్, శ్యామ్, మహమ్మద్ తాహెర్, పాండురంగరాజ్, ముఖేష్, బాలాజీ, దిలీప్ తదితర చేనేత, హస్తకళా విక్రయ సిబ్బంది పాల్గొన్నారు.