జన చైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Published: Saturday October 15, 2022
బూర్గంపాడు మండలం ( ప్రజా పాలన.) 
మునుగోడు ఉప ఎన్నికలలో BRS పార్టీ (టిఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  గెలుపు కోసం భద్రాచలం పట్టణానికి చెందిన తుడిక ప్రసాద్  BRS పార్టీ గెలుపు కోసం చేపట్టిన జన చైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించిన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు .
 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  శుక్రవారం నాడు మునుగోడు ఉప ఎన్నికలలో BRS పార్టీ అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  గెలుపుకై BRS పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్  పై ఉన్న అభిమానంతో భద్రాచలం పట్టణానికి చెందిన BRS పార్టీ నాయకులు తుడిక ప్రసాద్  చేపట్టిన జన చైతన్య సైకిల్ యాత్రను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ప్రారంభించారు, ఈ సందర్భంగా అతని అభిమానానికి అభినందనలు తెలిపారు,
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ...

 దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని, ఈ దేశంలో 75 సంవత్సరాల కానీ అభివృద్ధి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి జరిగిందని, ప్రతి రైతుకు సంవత్సరానికి 10000 వేల రూపాయలు సీఎం కేసీఆర్  ప్రభుత్వం ఇస్తుందన్నారు.  రైతు ఏ విధంగా అయినా చనిపోతే 10 రోజులలో ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్  ప్రభుత్వం అని తెలియజేశారు., ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సొంత రాష్ట్రమైన గుజరాత్ లో 600 రూపాయలు పెన్షన్లు ఇస్తుంటే, తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ 2016 రూపాయలు, వికలాంగుల పెన్షన్ 3016 ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, గుజరాత్ రాష్ట్రంలో 12లక్షల 50వేల మందికి పెన్షన్ ఇస్తుంటే భారతదేశంలోని 46 లక్షలు మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లక్షా 116 వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో BRS పార్టీ (టిఆర్ఎస్) శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని  ఆయన స్పష్టం చేశారు.