గల్ఫ్ కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Friday January 27, 2023

జన్నారం, జనవరి 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమం సమితి క్యాలెండర్ ను గురువారం టీజీడబ్ల్యుడబ్ల్యుసి జన్నారం మండల అధ్యక్షులు పాలాజి శ్రీనివాస్ చేతుల మీద జన్నారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేపూరి గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ముఖ్యమంత్రి కెసిఆర్ KCR ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచిపోయారని వాటిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  ఇ కార్యక్రమము లో రోటిగుడ గల్ఫ్ కమిటీ సభ్యులు మరియు జన్నారం పొనకల్  గల్ఫ్ కమిటీ సభ్యులు, మండల ప్రధాన కార్యదర్శి దుమాల ఎల్లయ్య టి జి డబ్ల్యూ డబ్ల్యూ సి రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, మహమ్మద్ బాద్ గల్ఫ్ కమిటీ సభ్యులు, ధర్మారం గల్ఫ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.