అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన - జడ్పీ చైర్ పర్సన్ వసంత,ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Wednesday April 07, 2021
జగిత్యాల, ఏప్రిల్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల చలిగల్ గ్రామంలో డిఎంఎఫ్టి నిధులు 9.20 లక్షలతో స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ గంగారాం గౌడ్ ప్యాక్స్ చైర్మన్ లు మహిపాల్ రెడ్డి సందీప్ రావు నక్కల రవీందర్ రెడ్డి సర్పంచ్ ఎల్లా గంగానర్సు రాజన్న ఉప సర్పంచ్ పద్మ తిరుపతి ఆనంద్ రావు ఏఎంసి డైరెక్టర్ మోహన్ రెడ్డి నాయకులు సత్యం షకీల్ వెంకటేష్ ముత్యం పెరుమాండ్లు సాహెల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.