ఆగ్నిపథ్ దేశద్రోహమే: సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు 2 కోట్ల ఉద్యోగ సృష్టి ఏ

Published: Saturday June 18, 2022
బోనకల్, జూన్ 17 ప్రజా పాలన ప్రతినిధి: దేశ భద్రత కోసం నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు విధానంతో భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆగ్నిపథ్ విధానం ముమ్మాటికీ దేశద్రోహమేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు అన్నారు. మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మండల కార్యదర్శి యంగల ఆనందరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2014 సంవత్సరంలో ఎన్నికల హామీలలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల నియమాకాలు చేపడతాన్న మోడీ మాటు నీటిమూటలయ్యాయన్నారు. ఇప్పటికే దేశంలోని నవరత్న, మహారత్నలాంటి లాభాలు ఉండే కంపెనీలను కార్పోరేట్ శక్తులకు అతిచౌకగా
నరేంద్రమోడీ అమ్మేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలుతాము సంపాదించుకున్న సంపదలో కొంతమేర ట్యాక్స్ రూపంలో చెల్లించి ఆదాయాన్ని సమకూర్చి పెడుతుంటే నరేంద్రమోడీ మాత్రం తాను ఎన్నికలలో గెలుపొందడానికి దోహదపడిన తన మిత్రులకు ధారదాత్తం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశ రక్షణ రంగంలోకి 100 శాతానికి తీసుకువచ్చిన మోడీ, దేశరక్షణను పరాయి దేశాల చేతిలో పెట్టారన్నారు. దేశ జిడిపి నానాటికి దిగజారిపోతున్న తరుణంలో, దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి పెరుగుతున్న సమయంలో దేశప్రజల్లో ఉన్న వ్యతిరేకతను రూపుమాపడం కోసం బిజేపీ మతం పేరుతో కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. దేశానికి రక్షణ కల్పించే రక్షణ విభాగంలో కాంట్రాక్టు పద్దతి ఏమిటని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలే ఉద్యోగం ఉండడంతో దేశ రహస్యాలు ఇతర దేశాలకు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆగ్నిపరన్ను విరమించుకొని పాత పద్దతి ద్వారానే సైనిక ఎంపిక జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
 
 
 
Attachments area